పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0119-3 ఆహిరి సంపుటం; 07-111

పల్లవి:
నీతోడి విరహానను నెలఁతమై నిన్నియును
కాతరించి బెదరీ సంగతి సేయవయ్యా

చ.1:
కందువలఁ బొదివి జక్కవలను దువ్వుదువు
ముందు ముందె తుమ్మిదల మూఁక గూర్తువు
విందుగా చకోరాలకు వెన్నెలలావటింతువు
యిందుముఖి పిలిచీని యిట్టె రావయ్యా

చ.2:
కలయ మాటాడి చిలుకలఁ బలికింతువు
పలుమారుఁ గోవిలలఁ బాడింతువు
అలర ముంగిటను రాయంచలనాడింతువు
యెలమినంగన విల్చీ నిట్టె రావయ్యా

చ.3:
నెయ్యము మీఱఁగ తేనియ పెరరేఁతువు
చెయ్యంటి మయూరముఁ జెలఁగింతువు
వొయ్యనె శ్రీ వేంకటేశ వొనగూడితివింతలో
యియ్యెడఁ గామిని విల్చీ నిట్టి రావయ్యా