పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-6 సౌరాష్ట్రం సంపుటం: 07-108

పల్లవి:
నయగారి మీ సుద్దులు నాకుఁ గొత్తలా
ప్రియములన్నియు దాఁచి పెట్టెఁ బెట్టవయ్యా

చ.1:
మిక్కిలి నీవు మెచ్చఁగా మేనికీ వెంగేమై తోఁచీ
దిక్కులవారు నవ్వేరంతేశాలయ్యా
చక్కెర యేదుగానైతే చవి మొగచాటు గాదా
వొక్కమారే యింతగద్దా వూరకుండవయ్యా

చ.2:
పూని సారెఁ బొగడఁగా పాందులకు వేఁగయ్యా
తేనె గారీఁ దీపుల నంతేశాలయ్యా
నూనె గొలచే కుంచము నునుపెక్కు మీఁద మీఁద
ఆనక మై దిగువారీనాయనాయనయ్యా

చ.3:
నగవులేదు గాఁగా నాము గడువేసీని
తెగరానిచోట్లు అంతేశాలయ్యా
పగటు శ్రీ వేంకటేశ పైకొంటివి కడపలో
అగపడె రతులు నీయాసలెంతేశయ్యా