పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-5 శుద్దవసంతం సంపుటం; 07-107

పల్లవి:
నీకేమయ్యా నీకు నీవే దొడ్డవాఁడవు
చేకొని చెట్టడిచితే చేటఁడేసి వావులు

చ.1:
తలపోఁతలొక్కటైతే తమక మినుమడాయ
నిలువుకు నిలువే నీబేరము
కొలిచినందే కొలిచి గోపికలకెల్లాను
వలవఁదీసితివిగా వలపులు నీవు

చ.2:
నగవులు మానెఁడైతే ననుపులడ్జెఁడేశాయ
నిగిడె నన్నచోట్లా నీబేరము
అగడుగా నాఁగిచ్చి (?) అంగనలకెల్లాను
జిగి వడ్డిగొంటివి సిగ్గులెల్లా నీవు

చ.3:
మోవితేనగ్గువలైతే ముదములు లాభమాయ
నీవు నన్నుఁ గూడినదే నీబేరము
భావించి శ్రీ వేంకటేశ పడఁతులకెల్లాను
వావాత నమ్మితివిగా వయసులు నీవు