పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-4 ముఖారి సంపుటం: 07-106

పల్లవి:
చెలులము నేమెందాఁకా చేరి విన్నవించేము
సాలసి నిన్నుఁ జూడఁగ చుఱుకనె మనసు

చ.1:
ఈడనేకతమాడఁగా నింతి నన్నుఁ గోపగించె
ఆడరాదా అందు గొంత ఆపెతోడను
వాడుమోవి వంచుకొనె వత్తివలెనాయ మేను
చూడరాదా ఆపెదిక్కు చుఱుకనె మనసు

చ.2:
చెంగలించి నీవు రచ్చసేయఁగా నీతోనలిగె
అంగవించి వుండరాదా ఆకింటాఁ గొంత
కుంగి చేతిపైనొరగి గొబ్బున మెయి చెమరించె
చుంగుపయ్యదెత్తరాదా చుఱుకనె మనసు

చ.3:
వలపంతటాఁ జల్లఁగా వనిత నిన్ను దూరీని
కలయఁ జల్లఁగరాదా కామినిమీఁద
యెలమి శ్రీ వేంకటేశ యిప్పుడాకెఁ గూడితివి
సళువు దెలుపరాదా చుఱుకనె మనసు