పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-2 శ్రీరాగం సంపుటం; 07-104

పల్లవి:
ఏల దాఁచేవింతలోనే యిందరిముందరా నేఁడు
చాల మెచ్చేఁగాని యాసతిఁ జూపరాదా

చ.1:
చెంతల నేంబిలిచితే చేరి వూరకున్నాఁడవు
పంతము దప్పీనా పలికితేను
యింతలో నేమస్తునిగా నెవ్వతె సేసెనో నిన్ను
సంతోసించేఁ గాని ఆసతిఁ జూపరాదా

చ.2:
అంకెలఁ జెక్కు నొక్కితే నట్టే తల వంచేవు
సుంకము వచ్చీనా చూచితెను
పంకించకెవ్వతె నిన్ను బమ్మచారిఁ జేసెనో
సంకెదేరిచేఁ గాని ఆసతిఁ జూపరాదా

చ.3:
తనువు చేతనంటితే దాఁగి నన్నుఁ గూడితివి
అనుపు నిన్నుఁ గొనేరా అట్టే వచ్చితే
యెనసి శ్రీ వేంకటేశ యెవ్వతె నీకు నేర్చెనో
చనవు చూచేఁగాని యాసతిఁ జూపరాదా