పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0118-1 పాడి సంపుటం; 07-103

పల్లవి:
అన్నిటాఁ గలికివైతే నౌదువు గాని
యెన్నరాదాతని ప్రియమియ్యకొనవే

చ.1:
వసముగాని పతితో వాసులేల నెరపేవే
కసుగాటు వలపుల కాయవు నీవు
రసములు చిందినదె రమణుఁడు మాటలనే
విసువక ఆదరించి వినఁగదవే

చ.2:
మేటియైన విభునితో మేకులు చూపకువే
తేట వయసుల పూవుఁదీగెవు నీవు
మాటులేని మందు నూరీ మగఁడు నవ్వులనే
చాటుకుఁ బోకందుకొని సమ్మతించవే

చ.3:
శ్రీ వేంకటేశ్వరునితో సిగ్గులు వడకువే
దేవరవంటి పట్టపుదేవివి నీవు
చేవదేర మన్నించి చేఁతల నిన్నీతఁడు
పూవువలె నిట్లనే భోగించవే