పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0117-6 నాదరామక్రియ సంపుటం; 07-102

పల్లవి:
వేగిరమా యిప్పుడేమి వేఁడి వలపు
చేఁగదేరఁగా నీవే చేరి మన్నించేవు

చ.1:
మాటలు నీతోనాడి మనసులు సోదించ
అఁటది నేరుచునా అంతేసి
పాటించి పూడిగాలుసేసే బల్లిదురాలనైతేను
నీటున నీగుట్టెల్లా నీవే ఆనతిచ్చేవు

చ.2:
సన్నలు నీతోడేనాడి చాయకు నిన్ను దిద్దుకో
కన్నెలు నేరుతురా కపటాలను
అన్నిటా యిచ్చలాడీ సుద్దాత్మురాలనైతేను
వున్నతి వోజకు వచ్చి వుబ్బున మెచ్చేవు

చ.3:
మెల్లినే నిన్నుఁ బొగడి మేరలు మాఱి నవ్వఁగా
యిల్లాండ్రతరమా యెందునైనాను
యిల్లిదె శ్రీవేంకటేశ యెనలుతి విట్లయితే
పల్లదొన నెప్పుడూనుఁ బాయకవుండేవు