పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0102-3 వరాళి సంపుటం; 07-009

పల్లవి:
ఎరవా నీవు నాకు యిందుకే కాక
సరవితో నుండనా యీచలాలకే కాక

చ.1:
పంతమా నే నీకు బాగాలిచ్చేయందుకు
అంతలో నీవాపెకిచ్చేవని కాక
చెంతల నీకేమి సేవ చేసినాను దోసమా
కొంత నీతోఁగూడి యాపె కూచుండఁగాఁగాక

చ.2:
నలువంక నేనీతో నవ్వకుండేదాననా
సాలసి యాపె యీదిక్కు చూడఁగాఁ గాక
మలసి యప్పటి నీతో మాటాడఁ దగదా
వెలయ నీవద్లనాపె వినఁగాఁ గాక

చ.3:
యేమాయ నీపాదములిటు నేము పిసికితే
దోమటినాపెకాలు దొక్కఁగాఁ గాక
నేమాన శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
మోముచూతునా యాపెను మొక్కించఁగాఁ గాక