పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-6 దేశా(సా)క్షి సంపుటం: 08-078

పల్లవి:

సరివచ్చెఁ గదవే చల్లేటి నీవలపులు
గరిమె నీరమణుఁడుల గాలివంటివాఁడు

చ. 1:

తాలిమిగలవారికి తలఁపెల్లానీడేరు
అలరి కోపక త్తెలకాలు సోఁకు
యేల తప్పక చూచేవు యెఱఁగవా నీవిది
మేలిమి నీమగఁడు తుమ్మిదవంటివాఁడు

చ. 2:

చెంతనున్నవారికి చేతికిఁ జిక్కు బనులు
పంతపు మగువలకుఁ బట్టుఁ జలము
మంతనమేమాడేవు మాఁటిమాఁటికి నాతోను
మంతుకెక్కి పతి నీడమానివంటివాఁడు

చ. 3:

కూడినట్టివారికి గుణములెల్లా మంచివి
వేడుక వనితలకు వెలియే లోను
యీడనే శ్రీవేంకటేశునింతినీవు గూడితివి
తోడనితఁడెంచితే చంద్రునివంటివాఁడు