పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0249-5 వరాళి సంపుటం: 08-293

పల్లవి:

వారివారిభాగ్యము వలపుల కొలఁది
నేరుపు గలిగితేను నిన్నమాపే రేపూ

చ. 1:

కనుసన్న నాపె నిన్నుఁ గరఁగించఁ జూచితేను
యెనసి అవె(వ?)మ్ములైతే నేమిసేసును
వెనుకొని అవియెల్ల విరహవేళల నింతె
మన లొక్కటైతె తామరపూజలవును

చ. 3:

వుదవి చన్నులనొత్తి వూరడించఁ జూచితేను
యిమో పిడిగుండ్లయితే నేమిసేసును
పవళించి అవి రతిపంతమాడేవేళనింతె
కవగూడితేను జక్కవరూపులవును

చ. 3:

పెదవులెత్తి చెలియ ప్రియము చెప్పఁజూచితే
యెదురుగాలములైతే నేమిసేసును
కదియనివేళ నింతెకాని శ్రీవెంకటేశుఁడ
యిదె కూడితిరి యివె యిఁక తేనెలవును