పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0247-5 ముఖారి సంపుటం: 08-281

పల్లవి:

ఏఁటిమాఁట లిటువంటి వేలాడేవు
గాఁటమై యేకతమైతేఁ గాదనేనా

చ. 1:

చెప్పినట్టు సేతుఁగాక చిత్తములోపలి సిగ్గు
వొప్పగించి నీముందర నూరకుండేనా
కుప్పలైన కుచములు కొండలవలె నుండఁగా
తప్పక నాపయ్యదను దాఁచుకుందునా

చ. 2:

సమ్మతించి వుందుఁగాక జవ్వనపు నాగుట్టు
కుమ్మరించి నాకు నాకె కొనవేతునా
తెమ్మలైన పిరుఁదు మరుతేరువలె నుండఁగాను
నెమ్మది నీకెదురుగా నిలుచుందునా

చ. 3:

కూడితివి మెత్తుఁగాక కొనగోరి చేఁతలను
వేడుకకాని తనమును వెలివేతునా
యీడనె శ్రీ వెంకటేశ యెనసితి మిద్దరము
వాడిక వలపు లింక వడియఁ గట్టుదునా