పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0246-3 ముఖారి సంపుటం: 08-273

పల్లవి:

ఎవ్వరి కెవ్వరి చుట్టా లేమి బూమెలు సేసేవు
రవ్వల నాఁడు బుద్ధులు రండూ రెండే

చ. 1:

కన్నెల అలుక దీర్చి కాఁగిలించఁ బెట్టఁగాను
చన్నులుఁ జన్నులుఁ దాఁకి చప్పుడాయను
యెన్నికఁ గపటములు యెదలోనివి మాన్పేవా
సన్నల సవతులైతే జాతివైరాలు

చ. 2:

మానినుల నిద్దరిని మాటలాడించఁగాను
తేనెలుఁ దేనెలు సోఁకి తియ్య నాయను
నానిన వెంగేల వాఁడినాఁటినవి మానిపేవా
పూనిన వరుసవంతు పొరపొచ్చాలు

చ. 3:

కూడిన నీసతులనుఁ గూచుండఁ బెట్టుకోఁగా
తోడులు నీడలు నొక్క దోమటాయను
వాడిక పిన్నపెద్దల వావి నీవు వద్దనేవా
యీడుతో శ్రీవెంకటేశ కుందులు