పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0245-3 సామంతం సంపుటం: 08-267

పల్లవి:

అప్పటి కాఁతాళాన నందుముగాక
తిప్పఁబోతే నీగుణాలు తీరౌనా మాకు

చ. 1:

నేరుపుననాడె కల్ల నిజమువలెనెవుండు
యేరుపరచేమంటె యెటువచ్చును
నీరచనల నీవును నిలువునూరువండు
తారుకాణించే మంటె తరమా మాకు

చ. 2:

దరిచేరి దండాలు తనవద్దనెవుండు
సరవికి దిద్దేమంటె చాయకురావు
వెరసి మెయిగురుతులు వేయిసే నొక్కొక్కటి
వొరసి వెలవెట్టఁగ నోపికేది మాకు

చ. 3:

ప్రేమపు మోవితేనెలు పెదవిమీఁదనెవుండు
చేముట్టి వడ్డించఁబోతె చిరునవ్వులు
గామిడి శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
దోమటి దొడికేమంటె దొడ్డా మాకు