పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0233-1 శంకరాభరణం సంపుటం: 08-193

పల్లవి:

నేరుపరి విన్నిటాను నీకు నే లోను
కారముగాదు కప్రము కానీవయ్యా

చ. 1:

పలుకనేరిచితేను బయలెల్లాఁ బందిలి
చలము సాదించితే శశియేరవి
యెలమి నీమాటలకు నెదురాడగలనా
కలసి కాఁగిలించేవు కానీవయ్వయిఁకను

చ. 2:

వేసరక నిలిచితే వేఁగైనఁ జలువే
రాసి దంచదొరకొంటే రాయేపండి
ఆసపడి నీ వున్నందు కడ్డయీడఁగలనా
కై సేసుక నన్నంటేవు కానీవయ్యా

చ. 3:

గారవించి కూడితేను కాఁగిలే చెమటనీరు
గోర గీరఁబోతేను గుంతేయేరు
సారపు శ్రీవెంకటేశ సన్న సేయఁగలనా
కారణానఁ గూడితివి కానీవయ్యా