పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0221-6 కన్నడగౌళ సంపుటం: 08-126

పల్లవి:

దిట్టనా నేనంత యేమి దేవరవన్నిటా నీవు
యెట్టైనా నెగ్గులెంచక యీడేర్చుమీ

చ. 1:

నయగారి మాటలెల్ల నమ్మితిఁ గనక యిట్టే
భయము విడిచినీతోఁ బలికే నేను
దయగలవు గనక తడఁబడక యేపొద్దు
ప్రియములు చెప్పి నిన్నుఁ బిలిచే నేను

చ. 2:

ముంచిన నీచేఁతలకు మోహించిన దాననై
పొంచి వూడిగేలు సేసి పొలసే నేను
కంచముపొత్తువాఁడవు గనక నీపాదాలకు
వంచనలేక యేల వడిమొక్కే నేను

చ. 3:

కూడిన వాఁడవు గాన కొంకక శ్రీవేంకటేశ
వేడుక నీతో నవ్వి వెలసే నేను
యీడు లేక మన్నించితి వియ్యకొంటి నన్నిటికి
పాడితో నీయిచ్చకానఁ బరగితి నేను