పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0220-3 ముఖారి సంపుటం: 08-117

పల్లవి:

అంతదాననా నేను ఆనవెట్టఁదగుదునా
వింతవలపులు నాపై వేసితివి చాలదా

చ. 1:

వద్దనుండి మొక్కించేవు వనితలచే మొక్కులు
బద్దులు నీవి చాలవా పలుమారును
వొద్దికె నప్పటిఁగొన్ని వుపచారాలు వలెనా
తిద్దుబడి నోరుచుకో తిద్దితివి చాలదా

చ. 2:

చెలులచే సారెసారె చేయివట్టి తీయించేవు
చలమునీది చాలదా సాదించను
మలసి మావల్లనీకు మందెమేళాలువలెనా
నిలువెల్లాఁ దరితీపే నించితివి చాలదా

చ. 3:

అట్టె తెరవేయించేవు అండవారి చేతనెల్ల
రట్టులునివి చాలవా రాఁపుసేయను
దిట్టవై శ్రీవేంకటేశ తిరమై కలసితివి
మెట్టి పట్టుకొని నన్నుమించితివి చాలదా