పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-6 పాడి సంపుటం: 08-102

పల్లవి:

ఏమని వూరడించేవో యిఁక నీచిత్తముకొద్ది
దామెన తిట్లతోడ తలవంచీనదివో

చ. 1:

చెలి నినుఁ జేరవచ్చి చేతులెత్తి మొక్కగా
చెలరేఁగి చన్నులపైఁ జేయి చాఁచేవు
వెలఁదితో నవ్వులకు వేళావేళలు లేవా
సెలవుల నవ్వులనె సిగ్గుపడీనదివో

చ. 2:

అంగన బాగాలిచ్చి ఆకు మడిచీయఁగానా
యెంగిలి సేసేవు మోవి యిందరిలోన
గుంగిలి సరసాలకు కొంతైనా మరఁగువద్దా
సంగతి గాదని నీతో సన్నసేసీనదివో

చ. 3:

వువిద పైపై నీకు వూడిగాలు సేయఁగానా
జవళిఁ బాదాలు చాఁచి సారె పంచేవు
కవగూడితివి శ్రీవేంకటేశ తగవే కదా
పవళించి యింకా నీతో పంతమాడీనదివో