పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0217-4 శంకరాభరణం సంపుటం: 08-100

పల్లవి:

నేరుచుకోవేనీవు నిక్కము దంటతనము
ఆరితేరితే నిన్నునటు రట్టుసేయఁడా

చ. 1:

చెక్కుచేతితోడనింకా సిగ్గుపడేవు పతితో
మక్కువనేకతవేళ మరఁగేఁటికే
పక్కనఁ గన్నెవుగాఁగా పాలార్చీఁ గాకతఁడు
వెక్కసపు బ్రోడవైతే వెల్లవిరి సేయఁగా

చ. 2:

నాలిసేసి పానుపుపై నవ్వులు నవ్వేవు ఈనవు
కోలుముందైనమీఁదఁ గొంకనేఁటికే
పోలించి ముగ్దవుగాఁగా పొదిగీఁగాకాతఁడు
అలరి గద్దరివైతే నాయాలు సోఁకించఁడా

చ. 3:

పొంచినట్టి రతివేళ బొమ్మల జంకించేవు
మంచమెక్కి వావులింకా మానవేఁటికే
అంచెనురమెక్కించెఁగా కలమేలుమంగవని
నించి శ్రీవేంకటేశుఁడు నీకంటె మించఁడా