పుట:కాశీఖండము.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 73

నంతరవిముక్తతీర్థ మెయ్యదియొ యనిన
వరణయును నసియును నైనవారణాసి. 114

వ. భ్రూఘ్రాణంబులసంధి యవిముక్తస్థానం బది యభ్యంతరతీర్థంబు తీర్థంబులు బాహ్యాభ్యంతరభేదంబున ద్వివిధంబులై యుండు. 115

తే. ఎల్లవియు బాహ్యతీర్థంబు లిందువదన!
యరయ బాహ్యంబు లయ్యు నాభ్యంతరములు
కాశికాతీర్థ మాదిగాఁ గలవు కొన్ని
వాని వినిపింతుఁ బరిపాటి వనిత! వినుము. 116

సీ. శీర్షంబునందలి శ్రీశైలతీర్థంబు
మల్లికార్జునదేవుమనికిపట్టు
ఫాలభాగమునందుఁ బ్రాలేయమయ మైన
విమల కేదారతీర్థము వసించుఁ
గుచచూచుకములందుఁ గురుజాంగలమ్ముల
తీర్థరాజము సంప్రతిష్ఠ నొందు
భ్రూవల్లరీయుగ్మమునకు మధ్యంబున
నానందవనతీర్థ మధివసించు
తే. నంతరంగమునఁ బ్రయాగ మాశ్రయించు
నిమ్మహాతీర్థములు పార్వతీశ్వరునకు
విహరణస్థానములు వేదవిశ్రుతములు
వెలుపలను లోపలను నుండుఁ దలిరుఁబోడి! 117

వ. బాహ్యాభ్యంతరంబులయందును నవిముక్తతీర్థం బుత్తమోత్తమంబు. అట్టితీర్థంబుననుండి యఖండంబు సచ్చిదానందైక