పుట:కాశీఖండము.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

383


డై దివ్యవభనాభ్యంతరస్థం బైనజ్యోతిర్లింగంబునం [1]దంతరవించె. నంత బ్రాహ్మణులు నిజనివాసంబులకుం జనిరి. ఇది వృషధ్వజావిర్భావం బను నుపాఖ్యానంబు భోగమోక్షప్రదాయకంబు.

158


ఉ.

పంచసహస్రలింగములు భాసురమూర్తులు జ్యేష్ఠనాథతీ
ర్థాంచలభూమియందుఁ బ్రణతాఖిలనిర్జరముఖ్యమండలీ
కాంచనమౌళిరత్నకలికారుచిజాలపిశంగితాంఘ్రు ల
భ్యంచితభోగమోక్షవిభవాకరముల్ కలశీతనూభవా!

159


వ.

అని యెయ్యవి యనిన నాదిత్యలింగంబు పరాశరేశ్వరలింగంబు మాండవ్యేశ్వరలింగంబు మంకణేశ్వరలింగంబు జానుకేశ్వరలింగంబు సుమంతేశ్వరలింగంబు భారద్వాజేశ్వరలింగంబు వాజపేయేశ్వరలింగం బగ్నివర్ణేశ్వరలింగంబు ధ్రువేశ్వరలింగంబు వత్సేశ్వరలింగంబు కుక్కుటేశ్వరలింగంబు పర్ణాదేశ్వరలింగంబు సక్తుప్రస్థేశ్వరలింగంబు మాండూకేశ్వరలింగంబు బాభ్రవేయేశ్వరలింగంబు చ్యవనేశ్వరలింగంబు కలిందమేశ్వరలింగం బక్రోధనేశ్వరలింగంబు కంకేశ్వరలింగంబు కుంతలేశ్వరలింగంబు కఠేశ్వరలింగంబు తుంబురునారదేశ్వరలింగంబు మతంగేశ్వరలింగంబు మాగధేశ్వరలింగంబు జతుకర్ణేశ్వరలింగంబు జంబుకేశ్వరలింగంబు జారుధీశ్వర జలేశ్వర కాళేశ్వర గాలవేశ్వర మహాలింగంబు లాదిగాఁ గల మహాలింగంబులు వెండియు.

160


కందుకేశ్వర వ్యాఘ్రేశ్వరసంభవము

సీ.

ఒక్కనాఁడు భవాని యుబుసుపోవక పైఁడి

  1. దంతరించె