పుట:కాశీఖండము.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

శ్రీకాశీఖండము


యానముద్ర నాడీజాలంబు ధరించుటకు జాలంధరంబు. అపానమూలంబు బంధించుటకు మూలబంధంబు. ఈయైదుముద్రాబంధంబులు సమాధినిష్ణాకారణంబులు; [1]బిందుస్థిరీకరణకారణంబులు, గంధవహధారణాధురంధరంబులు.

241


తే.

ఊర్ధ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచుఁ
క్రింద నున్నయపానంబు గిట్టి పట్టి
యూర్ధ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచుఁ
గ్రింద నున్నయపానంబు గిట్టి పట్టి.

242


క.

మానక జీవుఁడు ప్రా
పానంబులచేతఁ దివియఁబడు వెలుపలికిన్
లోనికి నెక్కుచు డిగ్గుచుఁ
బౌనఃపున్యమునఁ బడనిపాటులఁ బడుచున్.

243


వ.

హంకారంబున బహిర్గమనంబును సకారంబున నంతర్గమనంబును జేయుచు హంసహంస యను ప్రణవాక్షరమూలభూతం బగునజపామంత్రంబున దివారాత్రంబు లిరువదియొక్కవేయునార్నూఱువారంబు లుచ్ఛాసనిశ్శ్వాసరూపంబున జీవుండు జపించు. అమ్మహామంత్రంబు సంకల్పమాత్రంబున.

244


సీ.

విను దూరవార్తలు వీక్షించు దవ్వుగా
        నడుచును శతయోజనములు గదియ
నశ్రుతం బగుశాస్త్రమైన వక్కాణించు
        గౌరవం బొందు లాఘవముఁ జెందుఁ
బరకాయములఁ జొచ్చుఁ బక్షికీటమృగాది
        బహుజీవజాతులభాష లెఱుఁగు

  1. కుష్ఠక్షయాపస్మారాదిరోగోపద్రవవిద్రావణంబులు