పుట:కాశీఖండము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 శ్రీకాశీఖండము

   నలఁతి లేఁజెమటచే నసలుకొన్న లలాట
కుంకుమంబునఁ జిన్నికురులు మునుఁగఁ
   బసిఁడికుండలఁ బోలు పాలిండ్లభరమున
సన్నపుఁగౌదీఁగె జలదరింపఁ
   ధవళతాటంకరత్నప్రభారింఛోళి
గండస్థలంబులఁ గౌగిలింపఁ
తే. గాశికారామకల్పవృక్షములనీడఁ,
    గుతపవేళలయందు నాఁకొన్నవారి
    కమృతదివ్యాన్న మిడు విశాలాక్షి గౌరి!
    శాశ్వతైశ్వర్యములు కృతిస్వామి కొసఁగు. 3

ఉ. పాయక నిర్నిరోధనిరపాయసమగ్రకృపాగుణైకపా
     రాయణవిలాసము తిరంబుగ నంబుజసూతి వీరనా
     రాయణు దానవైభవధురంధరు సంగరసవ్యసాచి దీ
     ర్ఘాయురుపేతుఁ జేయుత నృపాగ్రణి నల్లయవీరభద్రునిన్. 4

తే. కంఠపీఠిక నోంకారఘంట మొరయఁ
    జెలఁగుఁ గావుత మన్మనఃక్షేత్రసీమఁ
    గవికుటుంబంబుపాలిటి దివిజసురభి
    జలజసంభవుబోటి భాషావధూటి. 5

వ. అని సముచితప్రకారంబునఁ బూజ్యపూజాతత్పరుండనై యొక్కనాఁ డాత్మగతంబున నిట్లని వితర్కించితి. 6
సీ. చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు
రచియించితిని మరుద్రాట్చరిత్ర
   నూనూగుమీసాల నూత్నయౌవనమున
శాలివాహనసప్తశతి నొడివితి