పుట:కాశీఖండము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

శ్రీకాశీఖండము


దలఁతు రెవ్వారు వార లుత్తములు భువన
పావనాత్మకు లందఱు ప్రభులు మీకు.

160


సీ.

బ్రహ్మణ్యదేవ! శర్వ! ముకుంద! విశ్వేశ్వ
        ర! సనాతన! త్రిణేత్ర రావణారి!
శ్రీకంఠ! ధర్మధురీణ! శంభువ! కమ
        లాధీశ! యీశాన! యదుపతి! మృడ!
ధరణీధ[1]ర! హర! యంధకహర! శార్ఙ్గపా
        ణి! పురారి! విష్ణువ! నీలకంఠ!
వైకుంఠ! దేవదేవ! మధురిపుఁడ! త్రిలో
        చన! కైటభరిపుండ! చంద్రచూడ!


గీ.

కేశినాశ! గిరీశ! లక్ష్మీపతి! త్రిపు
రారి! వసుదేవసూనుఁడ! త్ర్యక్ష! యనుచు
జపము సేయుదు రెవ్వ రవ్విపులపుణ్య
ఘనులఁ గదిసినప్పుడు మీకుఁ గల్లవచ్చు.

161


వ.

మఱియు వినుండు. శ్రీకాంత! శివ! యసురనిబర్హణ! మన్మథరిపుఁడ! జనార్దన! ఖండపరశుఁడ! శంఖపాణి! శశిశేఖర! దామోదర! రిపుసూదన! యంబుధరనీల! స్థాణువ! యానందకంద! సర్వేశ్వర! యను నీదివ్యనామంబులు భావించుకృతార్థులు మీకు మాననీయులు సుండి యని యివ్విధంబున నంతకుండు గింకరవర్గంబు ననుశాసించె. ఈహరిహరనామంబులయష్టోత్తరశతంబు విన్ననుఁ బఠించిన జనులకు నారోగ్యైశ్వర్యంబులు సంభవించు.

162
  1. రాయంధకరిపు జనార్దన, చటులఖండ పరశుశార్ఙ్గపాణి, త్రిపురారి విష్ణుదేవేశహరిత్రిలో