పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పైమంత్రములో ఆర్యులకు శత్రువులై వారితో యుద్ధము చేయుచున్నది వారికి జ్ఞాతులని-అనగా పినతండ్రి పెదతండ్రిబిడ్డలని-స్పష్టముగా వినబడుచున్నది. నూరుగురిని ఏకకాలమున చంపగల ఆయుధమానాటికే ఆర్యులు కలిగియున్నారని పైమంత్రముననే వినబడుచున్నది.

ఆర్యులు, దస్తులు వేరువేరు జాతులవారు కారనియు వారందరు జ్ఞాతిసముదాయములోని వార లేయనియు ఉభయులకు యజ్ఞప్రియత్వ యజ్ఞ ద్వేషిత్వములే వారివిభాగమునకు హేతువులైనవనియు, యజ్ఞప్రియులు ఆర్యులనియు యజ్ఞద్వేషులగు ఆర్యులు అనార్యులు, అయజ్వలు, దస్యులు, మ్లేచ్ఛులు, మొదలైన పేర్లతో పిలువబడిరనియు వేదమంత్రములవలననే మనకు తెలియుచున్నది.

ఆర్య, దస్యు శబ్దములను వేదమే యనుగ్రహించినది. దానిని జూచువఱకు పాశ్చాత్యు లీశబ్దముల నెఱుగరు.

ఆర్యులకు దస్యులకు నిరంతరము యుద్ధములు సాగుచుండుట వలన శాంతికాములై ఆర్యులు భారతవర్షమును రెండుభాగములొనర్చి సింధునదికి పశ్చిమముగాగల యిప్పటి భారతవర్షములోని మ్లేచ్ఛ రాష్ట్రములతో గలిపి ఆఫ్రికాఖండములోని భారతవర్ష భాగములన్నియు దస్యులైన క్షత్రియశాఖలవారి కిచ్చి సదాచారులైన దేవధర్మముల నాచరించెడి ఆర్యులు సింధునదికి తూర్పుభాగమున నివసించిరి.

                "సింధుస్థాన మితి జ్ఞేయం రాష్ట్ర మార్యస్యచోత్త మం
                 మ్లేఛ్చస్థానం పరం సింధో: కృతం తేన మహాత్మనా." (భవిష్యపురాణము 3-3-2-20-21)

"సింధునదికి తూర్పుభాగమున గల వైదికార్యులు నివసించెడి దేశమునకు 'సింధుస్థాన' మనిపే రీయబడినది. దీనినే భరతఖండమని మనమిప్పుడు పిలుచుచుంటిమి. సింధునదికి పశ్చిమభాగమున గల భారత