పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ర్యులు, అయజ్వలు, వేదబాహ్యులు, అనాశినులు, అప్రతులు, అన్యప్రతులు, దస్యులు, మ్లేచ్ఛులు మొదలుగాగల నామములతో ఋగ్వేదములో వినబడుచుండిరి. ఆర్యులు చేయు యజ్ఞములను దస్యులనబడెడి ఆర్యజాతివారలు ధ్వంసమొనర్చు చుండిరి.ఆర్యుల గోవులను, ధనమును వీలగునప్పుడెల్లను దోచుకొనుచు దస్యు లార్యులను ఓడించుచుండిరి. అందువలన ఉభయులకు విరోధములు ప్రబలి అవి యుద్ధములుగా రూపొందినవి. అట్టి యుద్ధములలో వైదికార్యులు దస్యులనోడించి వారిని దేశమునుండి తరిమివైచిరి. అట్లు తరుమబడిన వారలు పశ్చిమముగా పోయి నిర్మానుష్యముగా నుండిన "ఇరాన్" దేశమున నివసించిరి. ఈవిషయమును గురించిన ప్రాచీన చరిత్ర ఋగ్వేదమునందును, 'జండవేస్థా' యనెడి పారశీకుల మతగ్రంథమునందును చూడగలరు. ఆవాక్యము లీ గ్రంథకర్తచే వ్రాయబడిన "మానవసృష్టి విజ్ఞానం" అనెడి ఇంగ్లీషు గ్రంథమున వివరముగా ఉదాహరింప బడియున్నవి.

భారత వర్షము

ప్రజాపతియై ప్రజలను పుట్టించి తానే స్వాయంభువ మనువు అనుపేరున వారికి రాజై ప్రజలను భరించినందున స్వాయంభువ మనువునకు "భరతుడు" అను పేరు కలిగినది. ఆతనిచే పరిపాలింపబడిన యీదేశము "భారత వర్షము" అని పిలువబడినది. భరతునిచే ప్రథమమున పరిపాలింపబడి భరింపబడినందున యీ భారతవర్ష ప్రజలైన "ఆర్యప్రజలు" భారతులు అని పిలువబడిరి. (వాయువుపురాణము 145-76; మత్స్య 112-15-10)

ప్రజావృద్ధిని చేయు నిమిత్తము స్వాయంభువ మనువు తనకుమార్తెలు ముగ్గురును ముగ్గురు బ్రహ్మర్షుల కిచ్చి వివాహ మొనర్చెను. వారి సంతాన పరంపరలచే భారతవర్ష మంతయు నిండినది. భారతదేశములోని బహిష్కారజాతులతోడను వారితోకలిసి యుండినందున మ్లేచ్ఛులుగా నెంచబడిన వైదికార్యులతోడను భూగోళములోని యితరదేశములన్నియు క్రమక్రమముగా నిండినవి. దేశ, కాల, భావ, శీతో