పుట:అక్షరశిల్పులు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


జూన్‌ 5న జన్మించారు. తల్లితండ్రులు: షేక్‌ మొహినుద్దీన్‌, మీర్‌ హాజరా బేగం. చదువు: సివిల్‌ ఇంజనీరింగ్లో డిప్లొమా. వృత్తి: విద్యాబోధన. 2000 నుండి రచనా వ్యాసంగం ఆరంభమై సుమారు పలు వ్యాసాలు, కథలు వివిధపత్రికలలో చోటుచేసుకున్నాయి. 'గీటురాయి' వారపత్రికలో 2005లో రాసిన

'అమ్ముడు బోయిన అమ్మ' వ్యాసానికి మంచి గుర్తింపు వచ్చింది.

ఉర్దూ గ్రంథాన్ని 'ఖుర్‌ఆన్‌ నాలుగు ముఖ్య విషయాల మీద విశ్లేషణ' (2010) పేరుతో తెలుగులోకి అనుదించారు. హిందీలో రాసి నపలలు వ్యాసాలు, క వి త లు'కాంతి' (డిల్లీ) హిందీ మాసపత్రికలో ప్రచురితం. లక్ష్యం: ఇస్లాం సందేశ ప్రచారం. చిరునామా: షేక్‌ అబ్డుల్‌ బాసిత్‌, ఇం.నం. 3-84, రుద్రాంపూర్‌ -507119, కొత్తగూడెం మండలం, ఖమ్మం జిల్లా, సంచారవాణి: 92471 72968.

అబ్దుల్‌ గఫూర్‌ ముహమ్మద్‌ మౌల్వీ: ప్రకాశం జిల్లా కంభం జన్మస్థలం. చదువు: మున్షీ, ఫాజిల్‌. ఉర్దూ పండితులు. ఉర్దూ, అరబిక్‌, తెలుగు భాషల్లో మంచి ప్రవేశం. అరబ్బీ నుండి తెలుగులోకి ఖుర్‌ ఆన్‌ గ్రంథాన్ని అనువదించారు. ఈ అనువాదం 1949లో రెండు భాగాలుగా వెలువడింది. రచనలు : జగత్ప్రవక్త, మిఫ్‌కాతెఫరీష్‌ (రెండు సంపుాలు), 'ముస్లిం ప్రభువులు'.

అబ్దుల్‌ హకీం జానీ షేక్‌: గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జనవరి ఒకటిన జననం. తల్లితండ్రులు: షేక్‌ మహబూబ్‌బీ, షేక్‌ ఫరీద్‌ సాహెబ్‌. చదువు: బి.ఏ., బిఎడ్‌. ఉద్యోగం: తెలుగు ఉపాధ్యాయులు. 1976లో విద్యార్థిగా 'కన్నందుకు శిక్ష నాటిక రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభించి 1991 నుండి 2009 వరకు తెలుగు పత్రికలలో వివిధాంశాల మీద సుమారు 12 వందల వ్యాసాలు, కవితలు ప్రచురితం. బాల సాహిత్యం పట్ల ప్రత్యేక ఆసక్తితో ఆరు పుస్తకాలు

వెలువరించారు. మరో 20 గ్రంథాలు త్వరలో, వెలువడనున్నాయి.

వయోజనుల కోసం రాసిన 18 గ్రంథాలు ప్రచురితం అయ్యాయి. ఆకాశవాణి ద్వారా కవితలు, కధానికలు, ప్రసారం. అవార్డులు -పురస్కారాలు: సమతారావు బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009). లక్ష్యం మానవీయ సంస్క ృతీ-సంప్రదాయల పట్ల అవగాహన కల్పిస్తూ, బాలబాలికల అభ్యున్నతికి ఉత్తమ సాహిత్య సృష్టి చేయటం. చిరునామా: షేక్‌ అబ్దుల్‌ హకీం జానీ, ఇంటి నం.

31

1