పుట:VrukshaSastramu.djvu/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

471

ఱకువేచి యుండ వలెను. క్రొత్త చోళ్ళు క్రొత్త బియ్యము వలెనే పాత వాని యంత బాగుండవు. వీనిని బీదలు తిందురు. ఇవియు బలమగు ఆహారమే. వీని నుండి కొన్ని చోట్ల సారాయిని కూడ దీయు చున్నారు.

అడవిచోళ్ళు మొక్కలు ఒకటి రెండడుగు లెత్తు పెరుగును. వానిపై తెల్లని రోమములు గలవు. గింజలు మూడు పలకలుగా నుండూ. వీనిని పశువు లంతగాదినవు.

నిమ్మ గడ్డి లోను చాల రకములు కలవు. కొన్ని ఆరడుగుల వరకు పెరుగును. నీని కణుపు సందులందు చిగుళ్ళు పుట్టు చుండును. ఈ చిగుళ్ళను నాటినను మొక్కలు మొలచును. వీని యల్పకణిశములు జతలు తజలుగా నుండును. వీని ఆకులకు నిమ్మ వాసన గలదు. దీని కాడలను ఆకులను కూరల లోను మజ్జిగ లోను వేసి కొందురు. ఆకులను తేయాకు వలె గాచి కొందరు త్రాగుదురు. కాడలను గోసి కట్టలు గట్టి వానికొక రాగి డేదిస లోవేసి బట్టి పట్టి చమురు తీయు చున్నారు. ఈ చమురు సబ్బులలో వేయుటకును, అత్తరవులో వేయుటకును, సుగంధ ద్రవ్యములు చేయుటకును వాడుచున్నారు.

పెద్దకంట్లు ఇసుక నేలలో బాగుగ పెరుగును. వీని కంతగా వర్షమక్కర లేదు. వానలకు ముందె వీనిని జల్లెదరు.