పుట:VrukshaSastramu.djvu/456

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

452

క్షకపత్రములుగాని, ఆకర్షణపత్రములుగానిలేవు. ఏకలింగపుష్పములు. అడుగున స్త్రీ పుష్పములు. పైన పురుషపుష్పములు నపుంసక పుష్పములు కూడ కలవు.

స్త్రీ పుష్పము.
అండ కోశము
అండాశయము. 3 గదులు. గింజలు స్థంభ సంయోగము. ఫలము కండ కాయ.
పురుష పుష్పములు
మూడో నాలుగో కింజల్కములున్నవి. పుప్పొడి తిత్తులు రెండు గదులు

నపుంసక పుష్పములలో నేయియు లేవు.

గజపిప్పలి

గజపిప్పలి అడవులలో చెట్ల మీద వేళ్ళమూలమున ప్రాకు చున్నచి. దీనికి నులితీగలు లేవు.

ఆకులు
ఒంటరి చేరిక. తొడిమగలదు. అండాకారము. సమాంచలము. సమ రేఖ పత్రము. కొన సన్నము.
ప్పుష్ప మంజారి
కంకి. ఊరుచేటిక యొక వైపున వంగియున్నది. అడుగున కాయ పచ్చగాను, పైన పసుపుపచ్చగానుండును. కంకి కొంచముపసుపు వర్ణముగా నుండును. దాని మీద నల్లని మచ్చలు గలవు. మిధున పుష్పములు.
పుష్ప కోశము
పురుచేటికతీసిల్వేయబడినది.
కింజల్కములు
4 కాండలు పొట్టివి. పుప్పొడి తిత్తులు 2 గదులు.