పుట:VrukshaSastramu.djvu/455

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

451

ను గావున సగ్గుబియ్యము చేయుటకుచెట్లు పుష్పింపక పూర్వము వానిని నరికి, దవ్వను చిన్న చిన్న ముక్కలుగ కోసిన పొడుము చేసెదరు. ఈ పొడుము నీళ్ళతోగలపి రెండు చేతులతోడను రాయచు జంత్రికల చట్రము వంటి వాని మధ్య పెట్టుదురు. నారంతయు పైన మిగిలిన, అడుగునకు పిండి పోవును. దీనిని చిక్కగ నీళ్ళతో గలపి జల్లెడల మీద పెట్టి చేతితోడనే కారపుపూస /బూంది దూసినట్లు దూయుదురు. కనుక పిండిఅంతయు చిన్న చిన్న యుండలవలెపడును. ఇదియే సగ్గుబియ్యము. సగ్గుబియ్యముయెక్క పరిమాణము ఆజల్లెడ కంతలను బట్టి యుండును.


చేమ కుటుంబము.


చేమమొక్క గుల్మమము. ప్రకాండము భూమిలోనున్నది.
ఆకులు
బాణాగ్రాకారము. తొడిమపొడుగు. పత్రముతో అంచును జేరక మధ్యగా గలయు చున్నది. సమాంచలము. సమరేఖపత్రము.
పుష్ప మంజరి
కంకి ఊరుచేటిక. దీనిని జుట్టుకొని యెదిగిన పిమ్మట విడిపోవును. తెలుపు రంగు.
కంకి
లావుగ మొక్కజొన్న పొత్తివలె నున్నది. దీనిమీద పెక్కుపుష్పములు గలవు. ఇవి చాలమారియున్నవి. ఉపవృంతములు లేవు. ర