పుట:VrukshaSastramu.djvu/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృక్షశాస్త్రము

ఉపోద్ఘాతము.


వృక్షములు మనవలెనే ప్రాణులనియు నవియు బుట్టుచు, నాహారమును సంపాదించుకొని పెరుగుచు, సంతానవృద్ధి గావించుకొని తుదకు సమసిపోవుచున్నవనియు మీరిదివరకే జీవశాస్త్రమునందు జదివియున్నారు. ఇప్పుడు ఆయావ్యాపారము లెట్లు జరుగుచున్నవో, వృక్షముల పరస్పర సంబంధము లెట్టివో, మనకు చెట్లె ట్లుపయోగకారు లగుచున్నవో దెలిసికొనుట యుచితము. అందుకై కొన్ని పారిభాషిక పదముల నేర్చుకొనుట అగత్యము. ప్రతిచెట్టు నందును వేరు శాఖ ఆకులను మూడు భాగము లుండును. అందు వేరును గూర్చి ముందు చర్చించెదము.

వేరు

గింజ అంకురింపగనే, మొలకను చలనములేక స్థిరముగ నిలువబెట్టుటకును, ఆహార పదార్థములను గొనివచ్చుటకును వేరు భూమిలోనికి బోవుచున్నది. ఎన్ని వంకరలుగ విత్తును బాతిపెట్టినను వేరు పైకివచ్చుటలేదు. ఇది దాని నైజము. అటు భూమిలోనికిబోయి పెరుగుచుండ దానినుండి శాఖోపశాఖలుగ కొన్ని వేరులు బుట్టుచున్నవి. ఆ మొదటి