పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52



దని తెలిసినది. అందుచేత పదిరూపాయీలు అపరాధము (జుర్మానా) విధింపబడుచున్నది." ఆనందము మాయమయ్యెను. తన పై అధికారితో తనశ్రమ కంతకును దొరికిన యీ పదిరూపాయల అపరాధమును గురించి మొర పెట్టు కొనెను. ఆ మొగలాయి మొహ తెమీం గారును అశ్చర్య పడి హెంకిన్ గారిని అతిదీనముగా ప్రార్ధించిరి. తుదకు హెంకిన్ నిట్లనిరి. “ఇతడు అతి చతురుడు. నేను పొగిడి రాష్ట్ర మంతటను ప్రఖ్యాతి కలిగించి నానని ఉబ్బిపోయి చెడి పోవచ్చును. అందుకై మందు గర్వి కాకుండ వృద్ధికి రావలెనని ప్రీతితో ఇట్లు బెదరించినాను. "


హేంకిన్ గారు వెళ్ళిపోయిన కొంత కాలమునకు తాలూక్దారుగారగు పెస్తోజీగారు జిల్లా పర్యటనముచేయ చుండ అతని యింటిలో అయిదారు వేల విలువగల సొత్తులు దొంగతనము య్యెనని వార్త వచ్చెను. వేంకట రామారెడ్డి గారును తాలూ కారుగారి వెంట దౌరాలో నుండిరి. వెంటనే వారిని తత్పరి శోధనార్థమైపంపిరి. తాలూక్దారునికి ఆరు వేలు పోయినందున ఆంతగా విచారముకలుగ లేదు. కాని ఆ వస్తువులతో పాటు కొన్ని ముఖ్యమైన రాజకీయ సంబంధమగు సొంత కాగితములు ఉత్తరప్రత్యుత్త రములును ఉండెను. అనెక్కడ బయటపడునో తన కేమి ప్రమాదము కలుగునోయని తహతహపడెను