పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

203


పరిపాలనా దక్షతకు ఆంగ్ల విద్యగాని, విదేశీయ శిక్షణ గాని అవసరం లేదనే సంగతికి వేంకటరామా రెడ్డిగారి చరితమే మనకు నిదర్శనంగా ఉంది. వీరిలో మనకు గ్రాహ్యము కానియేదో మంచితనము, గొప్పశక్తి లేని యెడల, హైదరాబాదు శాసనసభయందు, మునిసిపల్ కార్పొ షన్ లో సభ్యతను వహించి, ఆయా పదవుల నెల్ల తెలివి తేటలతోను, శక్తి సామర్థ్యము లతోను, ప్రజానుకూలము గాను నిర్వహించుటయే సంభవించి యుండదు. దీనజన సేవాను రాగమే లేనియడల కుష్టుల, వృదుల, అనాధ బాల బాలికల శరణాల యముల నిర్వాహక భారాన్ని వహించి వాటి ఉన్నతికై శ్రమచేయటమే పొసగి యుండదు. ఒక వైపున ప్లేగు, ఇంకోవై పున ఇన్ ప్లు యన్ జా బయలు దేరి ప్రజను నాశనం చేస్తూవున్న సమయంలో తమప్రా ణాల కై నా లెక్క చేయక వీధి వీధి తిరిగి బీదల ఔషధ పానాదుల సమర్చి అత్యుత్సాహంతో ప్రజాసేవకు దిగివుండరు - యింకా రెవిన్యూ, జ్యుడిషల్ మ్యుసిఫల్ యుద్యోగీయుల, ట్రయినింగు స్కూలు విద్యార్థుల ప్లీడరీపరీక్షకులగా వుండి ప్రసిద్ధినిగాంచి యుంఉరు. యిట్లన్ని మార్గాల ప్రభు త్వాన్ని, ప్రజను, దేశాన్ని సేవిస్తూవచ్చిన రెడ్డిగారిని కొత్వా లు స్థానంనుండి నిర్గమింపజేసేదానికై యెందరెంత ప్రయత్నించి నప్పటికి నైజాం ప్రభువు వీరి యుద్యోగ కాలాన్ని హెచ్చిస్తూ వచ్చిన సంగతి ఒక్క టే చాలు, వీరి యోగ్యతను న్యాయళీలాన్ని ప్రజాసేవను నిర్ణయించే దానికి,