పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194


యమా ? దీనికి కారకులు రాజూ వేంకట గామా రెడ్డిగారు తప్ప యితరు లెవ్వరునుగారు. కలహ వాయువులు వీచు కాలములో వారుసుఖముగా నిద్రించువారు కారు. రాత్రింబవళ్లును అదే చింతతో నుండువారు. అందరిని సంతృప్తి పరచువారు. కలహ కారక లుండిన వారిని గుర్తించి వారికి భీతిగొల్పువారు.


బ్రిటిషిండియాలో వైస్రాయీలకే కాక వేలుయువ రాజుకు సహితము ఇబ్బందులు కలిగించు ప్రయత్నములు జరిగెను. కాని మన నగరములో మాత్రము వారికి విజయవంతముగా సర్వసుఖముగా సంపూర్తి గౌరవ పురస్సరముగా మర్యాదలు జరిగెను. వారు నగరమునకు వచ్చుటకు ఆరునెలలకు పూర్వము రాజాగారు. వైస్రాయి సేగా నొకటి స్థాపించి పోలీసు జవానులను హెచ్చుచేసి ఖుఫ్యాలను హెచ్చు చేసి నగరము లోనికి వచ్చు ప్రతి మనుష్యుని పరిక్షింప చేసి ఎన్నెన్నియో కట్టుదిట్టములు చేసి ప్రతి చిన్న విషయమును గూడ తామే విచా రించు కొనువారు.


వీరింత గ్పొపపదవిపై - అందు పోలిసుపదవిలో - నుండినను రాజులకు, నవాబులకు వీరి దర్శనము ఎంత సులభమో అంతకన్న హెచ్చుగా గొంగటి వాండ్లకు, గోచిబట్టల వాండ్లకు, అంత్యజులకు, బీదలకు. సర్వులకు లభించు చుండెడిది. గొంగడిలో నేమి ఆకర్షణయున్నదో కాని దానిని