పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

107


పోయెను. ఇది ఉభయ మతస్థుల నిగ్రహశక్తి వలస కాదు.కేవలము రెడ్డిగారి చాకచక్యమే దీనికి కారణమని పూర్వము తెలుసుకొనకుండిన గత సంవత్సరము నగరములో గొప్ప హిందూ ముసల్మాను మత కలహము చెలరేగిన కాలములో నిష్పక్షపాత బుద్దిగలిగిన అనేక ప్రభుత్వాధికారులును ప్రజలందరును బాగుగా గ్రహించుకొన గలిగిరి. సుమారు 15 సంవత్సషముల క్రిందట. గుల్బర్గాలో గొప్ప హిందూ ముసల్మాను మతకలహము జరిగెను. దానిగాలి హైద్రాబాదు వరకు వీచినను రెడ్డిగారు కొత్యాలుగా నుండిరి కాన ఏమియు ప్రమాదము లేక పోయెను! గణపతి నవరాత్రులలో ఊరేగింఫుల సందర్భము లలో ప్రతి సంవత్సర మేదో విధమగు సంఘర్షణ జరుగునట్టి పరిస్థితు లేర్పడు చుండెను. కాని ఒక్కసారియైనను ప్రమాదము కలుగకుండ చూచుకొనినారు. ఒక తడవ కొందరు పోలీసు జవానులే గణపతి ఊరేగింపులో అనసరమగు చొరవ కల్పించుకొని సంఘర్షణమునకు కారకులైరి. అంతట గణపతి విగ్రహమును వీధిలోనే దించి హిందువులు సత్యాగ్రహము ప్రారంభించిరి. రెడ్డిగారి వార్త తెలిసిన వెంటనే అచ్చటికి వెళ్లి వారి నెన్నియో విధముల సంతృప్తి పరచుటకై ప్రయత్నించిరి. ఎన్ని విధముల చెప్పినను వినక పోవుటనుచూచి మరి ముగ్గురు హిందూపోలీసు అధికారులను జత చేసికొని