పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104


రులు త్రాగకుండ ఉందురా అని యున రాజుగా రూహించి నారు కాబోలు! రెడ్డిగారా బహుమతిని గౌరవముతో తమ యింట నుంచుకోనినారు.


వీరి కొత్వాలీ కాలములోనే ఇర్విన్ ప్రభువు గారును, వెలింగ్డన్ ప్రభువు గారును హైదరాబాదుకు విచ్చేసిరి. ఆసందర్భములందును వీరు చాల మంచి యేర్చాటులు చేసి అందరి మెప్పును బడసిరి. వీరి కొత్వాలీ కాలములో స్పెయిన్ రాజుగా నుండిన డాన్ అల్ఫన్సో గారు హైదరాబాదు విచ్చేసి యుండిరి.


పూర్వమునుండియు కొత్వాలీశాఖ, హోం సెక్రటరీ శాఖకు అధీనముగా నుండెను. భూమ్యాదాయ శాఖతో సంబంధము లేకుండెను. సర్, కర్నల్ ట్ర్ంచి అను భూమ్యా దాయ శాఖామంత్రిగారు వచ్చిన తర్వాత వారి యధీనములో కొత్వాలీశాఖ యుంచ బడెను. సర్ ట్రెంచిగారు వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులు జరిగెను. అంతకు పూర్వము శ్రీ నిజాముప్రభువు గారి దేవిడీ పనులకుగాను ప్రత్యేక పోలీసు లేకుండెడిది. సర్ ట్రెంచి గారు వచ్చిన తర్వాత దేవిడీకి గాను 600 పోలీసు జవానులను, ఒక సహాయ కొత్వాలును, కొందరి అమీనులను ప్రత్యేకించిరి.