పుట:Thittla gnanam.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచిభావము కల్గియుండడము, మరియొకరు చెడు భావము కల్గి యుండడము నాకు తెలిసినదని చెప్పాడు. ఈ విధముగ మీ మనస్సులలో ఉండడము వలన కొంతకాలమునకు అశుభమును శంకించినవారు అజ్ఞానములో పడి, మాయప్రేరణతో నానుండి దూరమై పోవుటకు అవకాశము గలదు. కావున మీకు తెలియని నా వాక్కును గురించి మీకు వివరముగ తెలియజేయదలచుకొన్నాను అని ఇలా చెప్పసాగాడు.


మేము చెప్పుమాటలను కనిపించు ప్రపంచ అర్థముతో మరియు కనిపించని దైవ అర్థముతో రెండురకముల చూచుటకు అవకాశముగలదు. జ్ఞాని జ్ఞానవిధానముతో, అజ్ఞాని ప్రపంచవిధానముతో అర్థము చేసుకొనుచుందురు. మీలో ఒకరు ప్రపంచార్థముతో చూచుట వలన నామాట చెడుగా అర్థమైనది. ఒకరు జ్ఞానార్థము తెలియకున్నను నా మీదున్న గొప్పభావముతో మంచిగానే ఊహించుకొన్నాడు. ఊహ నిజము కావచ్చును అబద్దముకావచ్చును. కావున ఖచ్చితముగ తెలిసినదని చెప్పలేము. మరియొకరికి తల ముక్కలైపోవునట్లు శపించానని అర్థమైనది. ఆ విధముగ అర్థమగుట వలన జ్ఞానమునకే దూరమగుటకు అవకాశము గలదు. ఒకరికి దీవెనేమోనని మరియొకరికి దూషణగ అర్థమగుటకు పూర్వమున్న జ్ఞానము నేడు లేకపోవడమే కారణము. పూర్వము "నీ తలపండు పగలనాని" అనుమాట సంపూర్ణ దీవెనగ ఉండెడిది. ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెదిదో వివరించి తెలిపెదను. పండు అనగ తినుటకై పరిపక్వమునకు వచ్చిన ఫలము అని అర్థము. పండులో తిని అనుభవించుటకు కావలసిన పదార్థము కనిపించక నిలువయుండును. అలాగే తలలో కంటికి తెలియకుండ కర్మయను పదార్ధము అనుభవించుటకు తయారు గనున్నదను భావముతో కర్మను తలపండు అనెడివారు. ఒక పండు