పుట:Thittla gnanam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేయుచుండెను. జ్ఞానము మీద ఆసక్తి కల్గిన వారిని కూడ ఎన్నో కష్టములకు గురిచేసి అన్నిటికి ఓర్చుకొని తన సేవ చేసిన వారికి మాత్రము జ్ఞానమును బోధించుచుండెను. జ్ఞానమును బోధించిన తర్వాత దాని ప్రకారము నడుచుకోని వానిని తిరిగి వెనకకు పంపుచుండెను. ఆయన దగ్గర జ్ఞానము తెలుసుకొనుటకు చాలామంది ప్రయత్నించుచుండినప్పటికి ఆయన శిక్షణకు చాలామంది నిలువజాలకుండిరి. జంబుకేశ్వర మహర్షి గురువులందరికంటే గొప్పవాడని, ఆయనవద్ద గొప్ప జ్ఞానము కలదని తెలిసినవారు కొందరు దక్షణదేశము నుండి బయలుదేరిపోయారు. వారిలో ఇద్దరు ఒక ఇంటినుండి బయలుదేరిన అన్నదమ్ములుండిరి. హిమాలయములలో జంబుకేశ్వరమునిని చేరుకొన్న దక్షణదేశస్థులు కొందరు చివరి వరకు నిలువలేకపోయారు. జంబుకేశ్వరుడు చెప్పు జ్ఞానము గొప్పదే, పెట్టు పరీక్షలు గొప్పవే. ఆయన పెట్టు జ్ఞాన సంబంధ పరీక్షలలో వారిగుణములు బయటపడడము వారికి అక్కడ స్థానము లేకుండపోవడము జరిగినది. చివరకు అన్నదమ్ములు మాత్రము గట్టిగ నిలువగలిగినారు. వారిలోనున్న పట్టుదలకు జంబుకేశ్వరు నికి సంతోషము కల్గినది. ఇద్దరు భక్తులలో పెద్దవాడు చిన్నవానికంటే ఎక్కువ జ్ఞానాసక్తి కల్గియుండడము గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు అతను పాద నమస్కారము చేసుకొన్నపుడు "నీ తలపండు పగలనాని" అని దీవించాడు. ఆ దీవెనలోని భావము సోదరులకిద్దరికి అర్థము కాలేదు. అయినప్పటికి పెద్దవాడు గురువుమీద గొప్పనమ్మకము గలవాడు, కావున ఆయన ఏమిచెప్పిన అది నాకు శుభమును కల్గించునదే అయిఉండుననుకొన్నాడు. చిన్నవాడు మాత్రము ఇదేదో అశుభమును కల్గించుమాటని అనుకొన్నాడు. వారి మనసులోని ఉద్దేశములను గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు ఇద్దరిని పిలచి నేను దీవించిన దీవెనను గురించి ఒకరు