పుట:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

69


    నిన్నుదరిచేసి భవదార్థినిస్తరించి
    దరిదఱియకున్నఁగలదె మోదము మురారి.

సీ. ఊరకుండినజూచి యొక్కింతనగి కృష్ణు
              డిదియేమి నీవన్న నిందువదన
    కుంచితావయవభం గురునృత్తి దత్పాద
              బిసరుహంబులకేలి బిగియబట్టి
    మచ్చిత్తహరములో మనవైరి! నీపాద
              వనరుహంబులు వీనివదలజూల
    వీనిలావణ్య మీవేషభూషణముగా
              నస్మత్కరార్థి తంబగుట సమగు

తే. గవయిది చలాంఛనం బగుగాతయనుడు
    నట్లయగుగాక సర్వంబు పలిత! నీవ
    నంబరవిముక్తకేశవి నఖిలభూష
    ణాంచి తాంగివినై యుండు మనియె శౌరి.

సీ. శాంబరీకచ్ఛ పేశ్వరకంకఠముదీప్త
              తాసింఛ నల్లీమ తల్లియనగ
    జవనసారణపతి స్ఫాటికి స్తంభజం
              ధద్విషన్మణిపాల భంజయనగ
    సవనతరాహదం ష్ట్రాఖనిత్ర ప్రోత
              కలకాక్షఘవకాల ఖండమనగ
    గకుబంతకరివర స్కంధసింధుద్వీప
              సంసార కాసిత హంసి యనగ

తే. భూరి భూభృచ్చి భోద్యన్మయూరి యనగ
     భృగుభగీరథభరతాది నృపభుజాగ్ర