పుట:TellakagitaM.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నేస్తమా!!

ఆలోచనల కవ్వాలతో గుండె కవాటాలను చిలకొద్దు..
అది రంగస్థలమైనా రంగుల ప్రపంచమైనా
కదలాల్సింది కన్నీరు కాదు..కాలి అందెలు

నువ్వేసే ప్రతి అడుగులో నే సిరిమువ్వనై ప్రతిధ్వనిస్తా..
నీ చేతి పారాణి ముద్రలలో వెలుగు కిరణాన్నై ప్రతిబింబిస్తా.

నువ్వెవ్వరని నువ్వడిగినా లోకమడిగినా
ఎప్పటికీ.. నాదిదే జవాబు.

వర్ణ వంధ్యత్వపు లోకానికి వర్ణ రహిత సువర్ణ దీపాన్ని
నడి సంద్రపు నౌక లాంటి నీకు సుదూర ద్వీపాన్ని

చిన్ని నాన్నా!

కలిసి నడుద్దాం ..
ఈ నీరెండలో ..
అప్పుడే అవసరం నీ తోడు.
ఊసులాడదాం
మలుపులవతల దారి కానరాని వేళ
అడుగుల ముద్రలు కొత్తపుంతలై..
ఎవరిమానాన వారైనవారైనా మునుపెన్నడూ చూడని కొత్త లోగిలిలో
ఆడి పాడదాం..
మమతల పవనాల పలకరింతలనాడు ..కలిగిన పులకరింతలు
నీ కేరింతలు.
నిరంతర బాటసారినైనా మునుపెన్నడూ పొందని
గిలిగింతల వింతలు.
నా గమ్యం ఎటువైపైనా నీతో కలిసి నడిచే అడుగే కద నాన్నా..! నను నిలిపి ఉంచేది.. నిను నిలువరించేది.. (లక్కీకి..)