పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నైనా యక్జామినరు కావడం తటస్థించే పక్షమున దానివల్లనున్ను వచ్చేసొమ్మును పెట్టిన్నీ టవును హాలు కట్టించి, నే నప్పడప్పడు ఇచ్చే వుప న్యాసములకున్ను వారానికి వకసారిగాని పక్షానికైనా నెలకైనా వకసారిగాని నేను యేర్పరచ బోయే సభలకున్ను ఆడ్డము రాకుండా వుండే పద్ధతిమిద దానివిూద వుండే బాకీలన్నీ తీరినతరువాత తగిన కట్టు దిట్టములతో వకకమిటీని యేర్పరిచి యీ పరమహాజనుల వుపయోగము నిమిత్తమై హాలును వారి ఆధీనము చెయ్య ను ద్దే శించుకొన్నాను. యీలోపుగా యెవరైనా తగు మనుష్యులు టవును హాలు నిమిత్తమై నేను చేసిన రుణములనున్ను నేను ఖర్చుపెట్టిన సొమ్మునున్ను "నాకు ఇచ్చివేసి, యీ మందిరమును జాతిమత భేదము లేకుండా పురజనుల కందరికీ వుపయోగపడేలాగున ఆధమం ఆరుగురు పెద్దమనుషులకు తక్కువకాకుండా వుండే కమిటీ వశంలో వుంచడానికి పూచీపడేయెడల, యే విధమైన స్వాతంత్ర్యములనున్ను నేను కోరకుండా యీ హాలున్ను స్థలమున్ను "నేను వారి స్వాధీనం చెయ్యగలవాడను. కాబట్టి యీ సంగతులను మీకు విశదపరిచినాను. ఈ సంగతులనే మొన్న ఆదివారంనాడు విజయనగరం మహా రాజులంగారి బాలికా పాఠశాలలో జరగిన సభికులకు మీటింగులో సభికులకు విన్నవించియున్నాను.

I beg to remain, Sir,

Yours faithfully,

K. VEERASALINGAM.”

Rajahmundry. l 26th March 1889, Tuesday !

ఈప్రకారముగా సభతోడి సంబంధమును వదల్చుకొని రెండుమూడు వేల రూపాయలతో నొక చిన్న మందిరమును కట్టింపవలెనని పని కారంభించి తిని. ఇంతకు ముందును మిత్రభావముతో "నాకు కావలసినప్ప డెల్లను వడ్డీ లేక బదులిచ్చుచుండినట్లే యీ పురమందిరము కొఱకును న్యాపతి సుబ్బారావు వంతులు గారు నా కేనూఱు రూపాయలు బదులిచ్చిరి నాశిష్యుఁడైన ఇంకొక కమిత్రుఁ డజ్జరపు వీరయ్యగారు రెండు సంవత్సరములలో తీర్చు పద్ధతి మీద నన్నూఱు రూపాయలను వడ్డిలేకుండ బదులిచ్చిరి. ఈ రు 900ల