పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○○入s」 స్వీయ చ రి త్ర ము నీతిచంద్రికలోని విగ్రహమును సంధినిచేసినతరువాత నాకొక నూలో చనము కలిగెను. సంధినికూడ నించుమించుగా విగ్రహతంత్రము శైలినే చేసి దానిని మాశాస్త్రపాఠశాలాధికారియైన మెట్కాఫుదొరగారి కంకితముచేసితిని. దీనినికూడ సర్వకలాశాలవారు విగ్రహమువలెనే పలుమాఱు పరీక్షలకు పఠ నీయ గ్రంథముగా నిర్ణయించుచువచ్చిరి. భాషవలని ప్రయోజనమేమి ? జను •లు తవు యభిప్రాయములనొండొరులకుఁ చెలుపుకొనుట. భాషలోని గ్రంథ ములవలని ప్రయోజనమేమి ? తమ భావములను దూరముననున్నవారికిని రాఁ బోవుతరములవారికిని సులభముగా తెలుపుట. ఆట్టి సౌలభ్యము విగ్రహము వంటి పుస్తకములవలనఁ గలుగునా? కలుగదు. ఆందలి పదములయొక్క_యు వాక్యముల యొక్క_యు నర్థమును దెలిసికొనుటకయి సామాన్యజ్ఞానము గలవారికి నిఘంటువులయొక్కయు పండితులయొక్క_యు సాయముకావలెను. ఇంత కష్టపడి యర్థము గ్రహింపఁ గలిగినను వారిందు క్రొత్తగా నేర్చుకొన్న దేమి ? సులభవచనరూపముననున్న పంచతంత్రములోనున్నదానికంటె విశేష మేది యులేదు. ఆట్లయిన గ్రో గ్రంథము లెట్లుండవలయును? అందఱికిఁ దెలియు నట్లు సులభము గానుండన లెను; అని నాలో సే నాలvశిచించుకొని ముందు వ్రా సెడు పు స్తకములను విగ్రహమువలెఁగాక సుగమములుగానుండునట్లు వ్రాయ నిశ్చయించుకొని నా యభిప్రాయమును నాలోపల సేయుంచుకొనక పత్రికా ముఖమునఁ దెలిపితిని. పండితులు నాతోనే క్షీభవింపక యట్లు చేసినచో భౌపయొక్క గౌరవమే పోవుననియు, బోసినోటివాఁడు బొక్కవలసిన పేల పిండివలె నిస్సారము గానుండుననియు, పేలవము గానుండుటచేత రసికులయిన వారికట్టి వ్రాతలు రుచింపక చిప్పిడిపాకము వలె నగ్రాహ్యముగా నుండునని యు, నిరసించుచు పరిహసించుచు నానావిధములనెకసక్కెము లాడ cజొచ్చిరి. ఆంధ్రభాషా సంజీవన్యధిపతులు గ్రంథములుమాత్రమేకాక వార్తాపత్రికలు సహితము కఠినమైన గ్రాంధిక శైలినేయుండవలెనని వాదింపఁజొచ్చిరి. ఆందు ಏನಿ "ਜੈਲੇਂ నాపత్రికలో నీక్రింది సీసపద్యమును వ్రాసితిని