పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

○_3)_2) స్వీయ చ రి త్ర ము రంగయ్య సెట్టిగారిచ్చెడు పదిరూపాయలును లేప్ప నాకక్కడ ధన సాహాయ్య మేమియు లేదు ; మనుష్య సాహాయ్యమంతకు మునుపే లేదు. వచ్చిన కొన్ని రూపాయలను సమాజము | మింగివేసినది. వుతీ యేసహాయము లేకపోయినను వూటలకు కఱవులేదు గనుక సభలలోను సంభాషణములలోను వాక్సహాయము -కావలసినంత వచ్చుచున్నను కార్యకారి -ෆර් ෆ්‍රොයි క్రియాశూన్యమయినది. రెండు మైళ్ల జూరవులాగో నో`క్ష గ్రును మూఁడు మైళ్ల దూరముల* నో`క్షరును నుండుటచేత మిత్రసమావేశము సహితవు తఱుచు గా లభింపకుండెను. కార్యములలో నాకు తోడుపడెడు మిత్రులు బుచ్చయ్య పంతులు గారు స్వర్ణస్థులయిరి. వితంతు శరణాలయములోనికి వచ్చెడువారు సాధారణముగా దూరమునందున్న గంజాము విశాఖపట్టణము నిrదావరీ కృష్ణామండలముల నుండివచ్చు తెలుఁగు నారే కాని చేసవనున్న య9వ దేశమునుండి వచే్చు নতজ্ঞ రొక్కరును కనఁబడలేదు. మిత్రులైన రంగయ్య సెట్టిగారు తామిచ్చెడు. చందాధనమును నేనెక్కడనున్నను నిత్తురు. ఈ హేతువు లన్నిటిచేతను నాకు చెన్నపురి విడిచి రాజమహేంద్రవరము మరలఁ జేరినచో నెక్కువ పని జరగ వచ్చునని తోఁచినది. వివాహములు చేసికొన్నవారు పదుగురును గాక శరణా లయములోనుండిన వితంతువులలో నిద్దఱు ప్రాథమిక పరీక్షలోను నొక్కరు మధ్యమ పరీకులా’ను కృతార్థరాండ్రయిరి. మతీయిద్దఱు భోజనమునకుఁ దక్క- మఱియెందునకును బనికిరాని వారయిరి. ఇతర దేశములో నెన్ని సౌఖ్యములున్నను ఎంత గౌరవ మన్నను మన స్సెప్పడును స్వదేశమువంకను జన్మ స్థలమువంకను భౌఱుచుండును! ద్ర; స్వాభా విక వాంఛకూడ పయి హేతువులతోడిపాటు నన్ను స్వస్థలగమనమునకుఁ బరి కొల్పఁజొచ్చెను, ఆయినను నేనిండ్లు కొని స్థిరనివాసమేర్పఱుచుకొనుట కన్ని యేర్పాటులు చేసినప్పడు చెన్నపట్టణము సెట్లు విడుతునాయనియు నాలాశ చించుచుంటిని. రాజమహేంద్రవరమునకు వెళ్లినను వెళ్లకపోయినను వచ్చి నంత యుపకారవేతనము నొంది పనిచాలించుకొనుటకు నేను నిశ్చయించు. గొంటిని. పనిలాగోనుండుటచేత నాకాలమంతయు దానిలాశినే పోన్దునుండెను.