పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

{{rh|74|శ్రీ వేంకటేశ్వర వచనములు| }


157

హాటకగర్భజనకా ! వేదవ్యాసవాల్మీకాది మునీశ్వరులునిన్ను సేవించి చిక్కించుకొని మోక్షం బడుగక యేరీతి నేమఱిరో ? శాస్త్రంబులు సదువుటతోఁ బరబ్రహ్మంబును వెదకెడి బ్రాహ్మణోత్తములైన విద్వాం సుల వివేకంబు లెందుఁ బోయెనో ? బ్రహ్మాది దేవతలు నిన్ను సేవించి నీ సాయుజ్యంబు వొందరై రే! వారి భాగ్యంబు లెందుఁబోయెనో ? అది యట్లుండ నిమ్ము. ఆది దేవుండై న నీ వీపు డందఱహృదయంబుల నున్నా వట ! నిన్ను భావించి వలచి యున్నారము శ్రీ మేకటేశ్వరా ! .

158

కరుణావరుణాలయా ! అతిప్రజ్ఞావిలసితము, అత్యంతమనోహరము, జీవనదీప్రవాహంబు చందంబున నెడ తెగక కల్పాంతంబుదాఁకఁ బాఱుచుండు నదియు నీ లీలా విభూతిమయము నగు నీ విశ్వమును బ్రవ్య కంబుగాఁ దోపించుచు జీవుల బ్రమయింపుచునో దేనా ! కర్తవైన నీ వేల యవ్య క్తుండవై యంతర్యామివై యందక పొందక యడఁగి యుఁటివన్నా ! అగపడినచో నార్డులయలజడి హెచ్చగునని వెఱపా ? వారికి నీవుగాక దిక్కెవ్వరు ? నోటిమాట చెవి వినునంతలో నార్తులమొఱనీ వాలకింతువట ! ధూర్తుల కెంతకు నందరానంత దూరమునమందు వట, ఆర్తత కెంతటి 'యోగ్యతనతికించితివి ! ఇంత దయతో మమ్ముఁ గాచుచున్న నినుఁగన్నులకరవుదీరఁ గనుఁగొనఁగోరు కొనుచున్నా రము. ఈ మనుగడనే మాకోర్కిఁగడ తేర్పవయ్యా శ్రీ వేంకటేశ్వరా !

159

ఆదిశేషశయనా ! ఉపవాసవ్రతంబుల నిన్ను సాధించెద మంటిమా యది సముద్ర సేతుబంధనంబు. నీ వేయుపాయంబుల చేతను నసాధ్యుం డవు, ఇందుకు దృష్టాంతంబుగ నీ శరణంబు సొచ్చి ప్రహ్లాద నారద శుక భీష్మ విభీషణ కరి శబర్య క్రూర విదుర హనుమ త్ప్రభృతులైన భాగ వతులు లోకంబులఁ బ్రఖ్యాతులై రి. ఇది మాకు దృష్టాంతంబని నిన్ను నొక్కని భజియించి నిశ్చింతంబున నుండెదము శ్రీ వేంక టేశ్వరా ! -