పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

viii

ఇంకను నిట్టివి శంకర వచనములని, శఠకోప విన్నపములని, కాలజ్ఞాన వచనములని, కాశికావచనములని, భవానీమనోహరవచనములని, శివరాజయోగవచనములని, లక్ష్మీవల్లభవచనములని, శేషగిరినాథ వచనములని మఱియుఁ గొన్ని పేళ్లతో వచనరచనలు ప్రాచీనములుగాన వచ్చుచున్నవి. అవి యెల్ల నించుమించుగాఁ బదునాలుగవశతాబ్దికిఁ అవి దరువాతివే కాఁదగు ననుకొందును. ఇప్పటికి నాయెఱుకకందినంతలోఁ గాల నిర్ణయముఁ జెప్పదగిన ప్రాచీనవచన రచనలలోఁ గృష్ణమాచార్య సంకీర్తనముల తర్వాత నీ ' వేంకటేశ్వరవచనములే' పేర్కొనఁదగినవి. ఈరెంటిలోఁ దొలిది పదుమూఁడవశతాబ్ది తొలిది. రెండవది పదునైదవ శతాబ్దితుదిది. ఇక్కడఁబ్రసక్తములు శ్రీవేంకటేశ్వరవచనములు

2. తాళగ్రంధి చూర్ణకములు.

ఇవి తిరుపతి క్షేత్రమున శ్రీవేంకటేశ్వరస్వామివారి దివ్యాస్థానమున సంకీర్తనాచార్యులుగ సుప్రఖ్యాతులయిన తాళ్లపాకవారు రచించిన వానిలోనివి. ఏతత్కర్త తాళ్లపాక పెదతిరుమలాచార్యుఁడు పదునైదవ శతాబ్ది చతుర్థపాదమున జనించి బదునాఱవ శతాబ్ది పూర్వార్ధమున వర్తిలినవాఁడు. [1]ఈ పెద తిరుమలాచార్యులవారికిఁ గుమారుఁడయిన చినతిరుమలాచార్యుఁడు, తన తండ్రి పెదతిరుమలాచార్యులు వ్యాఖ్యానించిన తీరుననుసరించి, తనతాత తాళ్లపాక యన్నమా


యవనసమ్మర్దదుర్దినంబైనదిగువ |తిరుపతినిజూడుమిటువంటితఱిని నిదుర పోవుచున్నాఁడు మీయన్న లేవలేక | శత్రుసంహార! వేంకటాచలవిహార!

  1. ఆతనికాలముననే యీవచనములు రాగిరేకులమీఁదఁజెక్కింపఁబడి తిరుపతి దేవస్థానమున భద్రపఱుపఁబడినవి. ఈ వచనములేకాక తాళ్లపాకవారి పద్యగద్య గేయ రచనములనేకములు రాగి రేకులపైఁ జెక్కబడి భద్రపఱుపఁబడినవి. అందుఁ గొన్ని ఱేకులు అహోబలమునకు శ్రీరంగమునకునుగూడఁ జేర్చఁబడినవట! ఇటీవల నహోబలములోని రాగిరేకులు కొన్ని రాగిపాత్రలకై యమ్మ ఁబడినవనియు, నట్లమ్మఁబడినవి, నాలుగయిదువందల రూపాయలవిలువఁగల రాగిరేకులనియు వింటిని. తిరుపతి ఱేకులమీఁది సంకీర్తనాదులు శ్రీ తిరుపతి దేవస్ధానమువా రిప్పటికిఁగొన్నింటి ముద్రించిరి.