పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

శ్రీ వేంకటేశ్వర వచనములు


147

అఖిలాండకోటి బ్రహాండనాయకా ! ఆది మధ్యాంతరహితా !అంబుజాసనాది వంద్యా ! శ్రీయలమేలుమంగా మనోహరా ! నీనా మంబు లనంతంబులట ! నీ జన్మంబు లవాజ్మనసగోచరంబులట ! నీ గుణము లెవ్వరుఁ దెలియ సమర్థులుగారట ! నీ నాభికమలంబునం బుట్టిన బ్రహ్మ నాళంబునుంగానక శతవర్షంబులు తిరిగి నీ నామస్మరణంబున నిన్నుఁగ నేనట ! అయితే యిఁక నొకటికలదు. నీ దాసులు నిన్ను విశేషం చిన విశేషము లేమని విన్నవించెదను. మాటి మాటికి నీ నామంబులు విన్నవించెదను, విన నవధరింపుము. శ్రీపురుషోత్తమా ! శ్రీకూర్మము లోలార్కము, వైకుంఠము, రంగనాథము, సర్పవరము, కనక గిరి, కనకాం బరగిరి, గోవర్ధనగిరి, యంజనగిరి, హ స్తిగిరి, యాళ్వారులగిరి, పండరంగ గిరి, గరుడగిరి, మంగళగిరి, నీలగిరి, రామగిరి, హేమగిరి, వేంకటగిరి, శ్వేతద్వీపము, హిరణ్యాద్రి, కుంతాద్రి, వృషభాద్రి, మదనాద్రి, ఘటికాచలము, శ్రీరంగము, ప్రమోదూతము, సత్యలోకము, ఆకాశ నగరము, శబరీ ప్రకాశము, ద్వీపాంతరము, పంపాతీరము, ఉత్పల్లాపదము, అగస్త్యాశ్రమము, శరణాగతము, కదళీవనము, క్షీరాబ్ది, బదరికాశ్రమము, నారాయణాశ్రమము, నై మిశారణ్యము, వింధ్యారణ్యము, మహా రణ్యము, సుబ్రహ్మణ్యము, బృందావనము, భక్తిస్థలము, కపిస్తలము, పాదస్థలము, శ్రీనివాసస్థలము, అవంతి, వజ్రము, కాళికాహృదయము, గయ, గంగాసాగరము, 'చక్రవర్దనము, సాగరసంగము, చిత్రకూటము, మణికూటము, హరిక్షేత్రము, కురుక్షేత్రము, అహోబలము, శ్రీ వైష్ణవము, హిమవంతము, చూర్ల ప్రతీకము, కపిలము, హాటకము, నిఖిలసాగరము, మయూరము,, శ్రీమద్ద్వారము, కురుకాయకము, భద్రనందనము, రవిమండలము, ఆదిశంఖము, పూనమంబరము, భీమ శంఖము, మర్ధాచలము, వృద్ధాచలము. నాసికాత్ర్యంబకము, హరిహరే శ్వరము, ఆళఘరి, చెన్న కేశ్వరి, శ్వేతాద్రి, తోతాద్రి, శ్రీరామము, శ్రీ రాఘవము, దివాభవము, పాతాళము, శ క్తిసాగరము, అగ్ని పురము,