పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiii

గ్రహించెనట! ఈతని యితర కృతులు ౧ శృంగార సంకీర్తనలు ౨ శృంగారదండకము 3 చక్రవాళమంజరి ౪ శృంగారవృత్తశతకము ౫ శ్రీవేంకటేశోదాహరణము ౬ నీతి సీసశతకము ౭ సుదర్శనరగడ ౮ రేఫఱకారనిర్ణయము ౯ ఆంధ్ర వేదాంతము (ద్విపద) ౧౦. ఆంధ్ర హరివంశము, ౧౧ భగవద్గీత (వచనము) ౧౨ శ్రీవేంకటేశ్వర ప్రభాతస్తవము, ఈతనికి వేదాంత ప్రతిష్ఠాపనాచార్యుఁడని బిరుదు. స్వామి కీతఁడు జరపినకైకర్యముల సారము[1] :—

పెద తిరుమలయ్యంగారు క్రీ. 1517 నుండి, 1552 దాఁక శ్రీవేంకటేశ్వరస్వామివారికిని ఇంకనితరస్థలములలోని దేవరలకును, నైవేద్య ప్రసా దోత్స వాదికైంకర్యములకై పదునాల్గు గ్రామముల నర్పించిరి. ఆ గ్రామములు, అచ్యుతరాయడు, బుక్కయ తిమ్మరాజు మొదలగువారు తనకు దానముచేసినవి. అంతేకాక యెన్నో వేల పణములనుగూడ నాయా పుణ్యకార్యములకై వారర్పించిరి. తిరుమలమీఁదఁ దమ సంకీర్తనములు చెక్కించిన రాగిరేకులు దాచియుంచిన సంకీర్తన భాండారము రక్షించుటకై యర్చించుటకైకూడ గొప్పదానములు చేసిరి. తండ్రిగారును దామును రచించిన సంకీర్తనములను స్వామివారి సన్నిధిని ప్రతిదినము పాడుటకై యిద్దఱు వైష్ణవులు నియోగించిరి, స్వామివారి కోనేటిని గోపురములను మంటపములను, బెక్కింటిని చక్కఁబఱిపించిరి. కోనేటి నడుమ నీరాడు మంటపమును గట్టించిరి. ఇట్లెన్నో పుణ్యకార్యముల జరిపిరి. తండ్రివలె నీతఁడుగూడఁ బూర్ణపురుషాయుష జీవితముగల్గిన ధన్య చరిత్రుఁడయియుండును. ఏలనఁగా నీతనితండ్రి క్రీ.1408 నుండి క్రీ.1503, దాఁకజీవించెను. అన్నమాచార్యునకీతఁ డఱువదవయేఁట జన్మించినాఁడనుకొన్నను, నీతని జన్మకాలము క్రీ. 1468 యగును. అప్పటినుండి 1552 తర్వాతిదాక నీతఁడు జీవించినాఁడనఁగా నెనుబదియేండ్లించుమించుగా జీవించినవాఁడగును. ఈతనికి


  1. తాళ్లపాక వారి చరిత్రాంశములు శ్రీసాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రకటించిన తిరుపతి దేవస్ధాలము ఎపిగ్రాఫికల్ రిపోర్టు (పేజీలు 382–291) ననుసరించి వ్రాసినవి.