పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

ఇందు ౧౪౭ వచనమున నూటయెనిమిది తిరుపతుల పేళ్లు పేర్కొనఁబడినవి నిత్యానుసంధానాదులగునర్వాచీనద్రావిడ వైష్ణససంప్రదాయ గ్రంథములలో నూటయెనిమిది తిరుపతుల (దివ్యస్థలముల) పేళ్లు ముద్రితములయియున్నవి. వాని పరిగణన మాతీరుగా నేనాఁడు జరగెనో గుర్తింపఁజాల నయితిని. ఆ పేళ్లకు నిందున్న వేళ్లకుఁ జాల భేదమున్నది. క్రీ. ౧౪౮౦ ప్రాంతముల నూటయెనిమిది తిరుపతులపేళ్లీ విధముగా నుండెనని దీనిఁబట్టి తెలియనగును. కాని యీపేళ్లుగల వచనపువ్రాఁతప్రతియొక్కటే తప్పులతో నుండుటచే నీ ముద్రణమున వ్రాఁతలోగల యాతీరేయున్నది. ఇందుఁగొన్ని స్థలములపేళ్లుతప్పులుగా నున్నట్టున్నవి. ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసమునను, హంస వింశతిలోను నూటయెన్మిది తిరుపతుల పేళ్లు నిందున్న తీరుననుసరించి యున్నవి. ఏతన్ముద్రణాంనంతర మా పేళ్ల నందుఁజూచితిని,

ఇందు వచనరచనారీతిలో ననంతుడు చెప్పిన గద్య(వచన) లక్షణము చక్కఁగా సనిపడినది. లక్షణశిరోమణికారుని ‘విన్నపము’ రచన కీవచనములు మంచిలక్ష్యము లనఁదగును. దూరాన్వయము, పమాసక్లేశము ననుప్రాసవిన్యాస పరిశ్రమము నిందులేవు. సూటిగా మనసున నాటునట్లు భావము లున్నవి. కొన్ని వచనములు టాగోరుగారి గీతాంజలీ రచనములఁ దలపించు నవిగాఁగూడనున్నవి. కృష్ణమాచార్య సంకీర్తనములు సరిగానిట్టివే వీనికిమూలకల్పములే కాని, యందు భాషా ప్రాచీనత యింతకంటె విస్పష్టముగా గోచరించునున్నది. ఈ వచనములను రాగతాళములతోఁ బ్రాచీనకాలమునఁ బలువురు పాడెడివారు గావలయు ; కవియే భావానుగుణముగా వీనికి రాగతాళములఁ గల్పించి నాఁడు.

తాళ్లపాకవారు

ఏతద్ గ్రంథకర్త తాళ్లపాకపెద తిరుమలాచార్యుఁడు నందవరీక స్మార్తబ్రాహ్మణుఁడంటిని, తాళ్లపాక నేటి రాజంపేట తాలూకాలో నున్నది. అది వీరి నివాసగ్రామము. ఈకవి తండ్రి.