పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xi

చార్యుఁడు సంస్కృతమున రచించిన 'సంకీర్తనలక్షణమును' దెలుఁగునకుఁ బరివర్తనము చేసెను. అందీ నచనరచనల నిర్వచనమిట్లున్నది.

“ మఱియుఁజూర్ణాఖ్యపదం బెట్టిదంటేనీ

క॥ ధరఁగృష్ణాచార్యాదిక పరికల్పితపదము తాళబంధచ్ఛందో విరహితమై చూర్ణాఖ్యం బరగు, నదినిరుక్తనామభాసితమగుచుౝ

మఱియుం దచ్చూర్ణ విధంబెట్టిదనిన ;

క॥ ఛందోగణముల నియతిం బొందక తాళప్రమాణమునఁ గడుఁజెలువై కొందఱిచేఁ దచ్చూర్ణం బందముగాఁ దాళగంధి యనఁ బోగడొందున్ "

పూర్వోదాహృతమైన సంకీర్తనలక్షణ గ్రంథనిర్వచనముచొప్పునఁ దాళగంధి చూర్ణము లనఁదగిన యీ వచనములను రచించి శ్రీస్వామి వారి సన్నిధిని శ్రీ తాళ్లపాక పెదతిరుమలాచార్యుఁడు రాగ తాళములతో నాలాపించువాఁడు కాఁబోలును! రాగిరేకులనుండి యెత్తి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానమువారింతకు ముందు ముద్రింపించిన వచనములు నలువదేడింటికి రాగ తాళములు నిర్ణీతములయియున్నవి.[1] మఱియు నం దీవచనములు ‘వైరాగ్యవచనమాలికా గీతము’లను పేరఁబేర్కొనఁబడినవి. అనఁగా నివి వచనములేయయినను గీతములుగాఁ బాడఁదగినవన్న మాట ! అందుచేతనే యిని సంకీర్తనలక్షణమున ‘తాళగంధిచూర్ణకపదము’లని పేర్కొనఁబడినవి. సంస్కృతమున వామనుఁడు వృత్తగంధి, ఉత్కలికాప్రాయము, చూర్ణము ననిముత్తెఱఁగుగల వచనరచనచెప్పఁగా నితఁడా చూర్ణమను వచనవిభాగముననే తాళగంధియని పదరచనా విభాగముగాఁ గల్పించినాఁడు. ఈ తెఱఁగు వచన రచనలకుఁ జూర్ణమను పేరు పొడిపలుకులతోనుండుటచే నేర్పడినదగుట నీతఁడు సూచించినాఁడు. మన యీ వేంకటేశ్వర వచనములు పొడి పొడి పలుకుల కూర్పే కాని, యిందుద్ధతోక్తులు ప్రౌఢసమాసములు లేవు. ఇట్టి పద రచనములకుఁ గృష్ణాచార్యాదులు, పరికల్పకులని యా


  1. గ్రంథావసానమున ముద్రింపఁబడినది.

B