పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

2వ అధ్యాయము.

అవసరమునుబట్టి దర్శనము నిచ్చుచుండును. అటులప్రత్యక్షమైనదర్శనము సాపేక్షిక ధర్మముననుసరించి సత్యమగును; అనగా వేర్వేఱు దశలలోను, వేర్వేఱు క్షేత్రములలోను ఉండుజనుల అనుకూలతనుబట్టి పఱగును. తానేరంగువేసికొనునో ఆదివ్యచిత్రకారునకే తెలియవలెను. ప్రకటితమగు స్వరూపములుగాని, నిరాకారత గాని వానిని బాధింపజాలవుసుడీ!

82. ఈవిశ్వలీల యెవనిదో అతడునిత్యుడు. మఱియు నిత్యుడై వెలయునతడెవ్వడో వానిదే యీలీలయును! ఈలీల ననువర్తించియే ఆనిత్యుని నీవు కనుగొనవలయును. మఱియు ఆనిత్యుని ఆధారముతోడనే నీవు ఈలీలను దరిచేరగలవు. కాన ఈలీల మిథ్యకాదు. దృశ్యక్షేత్రమున గోచరించు నిత్యుని ప్రదర్శనమేయిది:-

83. (ఇంద్రియములతోగూడిగాని, వానినిదాటిన జ్ఞప్తితోగూడిగాని భావక్షేత్రమందు) నీవొకపురుషుడవై యున్నంతకాలము, నీవునిరామయమని వచించునది సాపేక్షికరూపమేయగును, నీవు నిత్యమనునది , లీలను సూచించుచునే యుండును, నీవుకేవల ద్రవ్యమనునది గుణముల స్ఫురింపజేయుచునే యుండును, నీవునిర్గుణమనునది సగుణమును అపేక్షించుచునేయుండును, నీవు ఏకమనునది అనేకత్వమును స్మరణకు తెచ్చుచునేయుండును, తప్పదు.

84. నీవు ద్వైతభావముతో నున్నంతకాలమును, వెన్నను, మజ్జిగను అంగీకరింపవలసినవాడవేఅగుదువు. సాకారబ్రహ్మ