పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

100

ఱును యొకే అధికారమునకు ప్రతినిధులై, భక్తికిపాత్రులగుదురు సుమీ!

299. చల్లనుండి వెన్నను చిలికితీసినప్పుడు, దానిని ఆ చల్లతోపాటు ఒకేకుండలో నుంచతగదు. అటులయినచో దాని మాధుర్యమును చిక్కదనమును కొంతతగ్గిపోవును. దానిని వేఱుగ నిర్మలమయిన నీటిలో మఱొకకుండలో నుంచవలయును. అటులనే సంసారములోనుండి కొంత పరిపక్వ దశను సాధించిన పిమ్మట లోకులతోకలసి సంసారిక దుష్ప్రేరణలమధ్య నిలిచియుండునేని కళంకముపొందుట తటస్థించును. అటువంటివాడు సంసారమునకు దూరముగనుండిననే నిర్మలుడుగ నుండగలడు.

300. ఏనుగును విచ్చలవిడిగ విడిచివేసినప్పుడు అది చెట్లను మొక్కలను పెఱికివేయును. కాని మావటివాడు అంకుశముతో తలమీద ఒకదెబ్బవేయగానే ఊరకుండును. అటులనే మనస్సు నియమములేక విడిచినయెడల పనికిమాలిన తలంపులతో చెలగాటలాడుచుండును. వివేకము అను అంకుశముతో ఒకదెబ్బ తగులనిచ్చినయెడల తక్షణము నిశ్చలత వహించగలదు.

301. ప్రార్ధనలవలన నిజముగా ప్రయోజనముకలదా? ఉన్నది:- మనోవాక్కులుఏకమై శ్రద్ధతో దేనికొఱకైన ప్రార్థించినయెడల, ఆప్రార్థనఫలించును; నోటితోమాత్రము "స్వామీ, ఈసకలమునునీయవియే" అనుచు, హృదయములో